హరియాణాలో దారుణం జరిగింది. రేవారీ జిల్లాలో 25 ఏళ్ల మహిళపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.
రేవారి:హర్యానాలోని రేవరి జిల్లాలో 25 ఏళ్ల మహిళపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడటమే కాకుండా ఆమెను అమ్మకానికి పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. బాధితురాలు కొద్దిరోజుల క్రితం ఓ రైల్వే స్టేషన్‌లో ముఖేష్ అనే ట్రక్ డ్రైవర్‌ను కలిసింది. అతను ఆమెను తన గ్రామమైన ఖిజురీకి తీసుకెళ్లి డిసెంబర్ 10న అతని సోదరుడు, అనుచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం ఆమె కుమారుడిని పీకనొక్కి చంపేశారు. ఆపై సూరజ్ భాన్ సైనీ వ్యక్తి సహాయంతో ఆమెను సందీప్ అనే వ్యక్తికి రూ. 40 వేలకు అమ్మేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ముఖేష్ ను అతని సోదరుడు సతీష్, అతని ఇద్దరు అనుచరులు జైపాల్, హవాసింగ్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.