'అమ్మా ఐ లవ్ యూ' అంటూ నాలుగేళ్ల చిన్నారి తన తల్లికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది.
బెంగళూరు: 'అమ్మా ఐ లవ్ యూ' అంటూ నాలుగేళ్ల చిన్నారి తన తల్లికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన బెంగళూరులో జరిగింది.
బెంగళూరు నగర పరిధిలోని యలహంకకు చెందిన ఈ చిన్నారి నాలుగో తరగతి చదవేది. బాలిక తల్లి ఓ గార్మెంట్ ఫ్యాకర్టీలో పనిచేస్తోంది. కాగా బాలిక గత పది రోజులుగా స్కూలుకు వెళ్లలేదు. 'అమ్మా వారంపైగా స్కూలుకు వెళ్లలేదు. దయచేసి నన్ను క్షమించు. నేను ఎక్కడికెళ్లినా నీతోనే ఉంటా. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నా' అని ఆ చిన్నారి తన తల్లికి లేఖ రాసింది. సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బాలికను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.