‘రద్దు’.. గురిలేని క్షిపణి | Amartya Sen about cancellation of banknotes | Sakshi
Sakshi News home page

‘రద్దు’.. గురిలేని క్షిపణి

Jan 29 2017 2:43 AM | Updated on Sep 5 2017 2:21 AM

‘రద్దు’.. గురిలేని క్షిపణి

‘రద్దు’.. గురిలేని క్షిపణి

పెద్ద నోట్ల రద్దు లక్ష్యం లేకుండా ఏకపక్షంగా ప్రయోగించిన క్షిపణి అని

నోట్ల రద్దుపై అమర్త్యసేన్
ముంబై: పెద్ద నోట్ల రద్దు లక్ష్యం లేకుండా ఏకపక్షంగా ప్రయోగించిన క్షిపణి అని, ఎన్డీఏ సర్కారు ప్రజాస్వామిక సంప్రదాయాలను తుంగలో తొక్కి ఈ నిర్ణయం తీసుకుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్య సేన్  విమర్శించారు. ‘ఇది హడావుడిగా నిరంకుశత్వంతో తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వం తరచూ గురిలేని క్షిపణులను ప్రయోగిస్తోంది. నోట్లరద్దు అందులో ఒకటి..’ అని ఆయన శనివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. చైనాలో కొద్దిమంది ఆలోచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారని, కానీ భారత్‌ వంటి ప్రజాస్వామిక దేశాల్లో ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement