ఒకటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర | Amarnath Yatra begins From Monday | Sakshi
Sakshi News home page

ఒకటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

Jun 29 2019 9:03 AM | Updated on Jun 29 2019 9:04 AM

Amarnath Yatra begins From Monday - Sakshi

అమర్‌నాథుణ్ని దర్శించుకునే వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది.

శ్రీనగర్‌: హిమాలయాల్లో కొలువై ఉన్న అమర్‌నాథుణ్ని దర్శించుకునే వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. బల్తాల్, పహల్గామ్‌ మీదుగా రెండు మార్గాల్లో సాగే 40 రోజుల అమర్‌నాథ్‌ యాత్రకు సీఆర్పీఎఫ్‌తోపాటు కశ్మీర్‌ పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. తీర్థయాత్ర సందర్భంగా భద్రతా ప్రమాణాలను తుచ తప్పకుండా పాటించాలని హోం మంత్రి అమిత్‌ షా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement