4జీ యాడ్ను ఉపసంహరించుకోనున్న ఎయిర్టెల్ | Airtel told to withdraw 'misleading' 4G ads | Sakshi
Sakshi News home page

4జీ యాడ్ను ఉపసంహరించుకోనున్న ఎయిర్టెల్

Oct 1 2015 3:44 PM | Updated on Aug 17 2018 6:18 PM

4జీ యాడ్ను ఉపసంహరించుకోనున్న ఎయిర్టెల్ - Sakshi

4జీ యాడ్ను ఉపసంహరించుకోనున్న ఎయిర్టెల్

ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ భార‌తి ఎయిర్‌టెల్ 4జీ ప్రకటనను ఉపసంహరించుకోంది.

న్యూఢిల్లీ :  ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ భార‌తి ఎయిర్‌టెల్ 4జీ ప్రకటనను ఉపసంహరించుకోనుంది.  4జీ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రకటనల ప్రమాణాల విభాగం (ఏఎస్సీఐ)  నోటీసులు ఇచ్చింది. తక్షణమే ఎయిర్టెల్ తన యాడ్ను ఉపసంహరించుకోవాలని నోటీసులు ఇచ్చింది.

'ఎయిర్టెల్ 4జీ ఎప్పుడైనా, ఎక్కడైనా వేగవంతమైన నెట్వర్క్. ఒకవేళ మీ నెట్వర్క్ వేగంగా ఉంటే, మేము జీవితం మీ మొబైల్ బిల్లులు చెల్లిస్తాం' అంటూ ఎయిర్టెల్ 4జీ యాడ్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రకటనను ఏఎస్సీఐ సమీక్షించింది.   అయితే ఆ యాడ్... ప్రకటన కోడ్ చాప్టర్ 1.4ను అతిక్రమించి వాస్తవాలను వక్రీకరించేలా ఉందని అడ్వర్టైజింగ్ కౌన్సిల్ పేర్కొంటూ ఎయిర్టెల్ను నోటీసులు జారీ చేసింది. ఓ వినియోగాదారుడు  చేసిన ఫిర్యాదుతో ఏఎస్సీఐ ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తన ప్రకటనను ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. కాగా ఎయిర్టెల్ ఈ ఏడాది ఆగస్ట్లో 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement