వైఎస్ హయాంలో వ్యవసాయానికి పెద్దపీట | agricultural development in ysr's ruling,say kanna lakshmi narayana | Sakshi
Sakshi News home page

వైఎస్ హయాంలో వ్యవసాయానికి పెద్దపీట

Dec 30 2013 12:06 AM | Updated on Jun 4 2019 5:04 PM

2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ఆదుకున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

మంత్రి కన్నా లక్ష్మీనారాయణ


 సాక్షి, బళ్లారి (కర్ణాటక) : వ్యవసాయం దండగ అంటూ ఒకవైపు నాటి పాలకుల ప్రచారం... వ్యవసాయం చేసి బతకలేమా? అంటూ మరోవైపు రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రంగానికి పెద్దపీట వేసి ఆదుకున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆది వారం బళ్లారిలో సింధూరి ఆగ్రోస్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొ న్న మంత్రి మాట్లాడుతూ ఆంధ్రలో వైఎస్ రైతులకు అనేక రకాల ప్రయోజనాలు కల్పించి మేలు చేశారన్నారు.  రైతులు నూతన పద్ధతులను తెలుసుకుని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో  రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement