క‌రోనా నుంచి కోలుకున్న 92 ఏళ్ల బామ్మ‌

92 Year Old Wheelchar Woman Recoverd From Covid-19 - Sakshi

పూణె : పక్షవాతం కారణంగా వీల్‌చైర్‌కు పరిమితమైన 92 ఏళ్ల ఓ బామ్మ క‌రోనా నుంచి కోలుకుంది.  14 రోజుల క్వారంటైన్ అనంతరం నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌లో కోవిడ్  నెగిటివ్ రావడంతో ఆమె ఆరోగ్యంగా ఇంటికి చేరింది. ఏప్రిల్ నెల మొదటి వారంలో ఈ బామ్మతో పాటు ఆమె కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు కొవిడ్-19 పాజిటివ్ రావడంతో పుణేలోని సింబోసిస్ ఆస్పత్రిలో చేర్చించారు.

‘‘ఏడు నెలల క్రితం పక్షవాతం కారణంగా ఆమె ఎడమ వైపు శరీరం మొత్తం అచేతనంగా మారిపోయింది. కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన తర్వాత ఆమెను 14 రోజుల పాటు  క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించాం. ఇప్పుడామె విజయవంతంగా కోలుకున్నారు. కరోనా వైరస్‌‌తో వృద్ధులకు ఎక్కువ ముప్పు ఉన్నప్పటికీ... ఈ వైరస్ వచ్చిన వారంతా చనిపోతారని భయపడాల్సిన అవసరం లేదు..’’ అని సింబోసిస్ యూనివర్సిటీ హాస్పిటల్ సీఈవో డాక్టర్ విజయ్ నటరాజన్ పేర్కొన్నారు. కాగా ఆమె కోలుకోవడం ద్వారా ఈ వైరస్ బారి నుంచి వృద్ధులు కూడా కోలుకోగలరని మరోసారి రుజువైందని వైద్యులు సింబోసిస్ వైద్యులు పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top