పరారైన 8మంది ఉగ్రవాదుల హతం | 8 SIMI terrorists who earlier today fled from Bhopal Central Jail have been killed in an encounter | Sakshi
Sakshi News home page

పరారైన 8మంది ఉగ్రవాదుల హతం

Oct 31 2016 12:05 PM | Updated on Sep 4 2017 6:48 PM

పరారైన 8మంది ఉగ్రవాదుల హతం

పరారైన 8మంది ఉగ్రవాదుల హతం

పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో మధ్యప్రదేశ్లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8మంది సిమీ ఉగ్రవాదులు హతమయ్యారు.

భోపాల్: పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో మధ్యప్రదేశ్లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8మంది సిమీ ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం తెల్లవారుజామున స్టీల్ కంచం, గ్లాస్తో  జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్ను కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. బెడ్షీట్లతో తాడులా తయారు చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్నారు.

ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఉగ్రవాదుల జాడను కనుగొన్నారు. అయితే వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా, వారు ప్రతిఘటించడంతో పోలీసులు కాల్పులు జరపాల్సివచ్చింది. భోపాల్ జైలుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ఖేడీ గ్రామంలో పోలీసులు 8 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement