కొత్తతరంలో 6 కోట్ల మంది బడికి వెళ్లనేలేదు! | 6 million new generation not went to the school | Sakshi
Sakshi News home page

కొత్తతరంలో 6 కోట్ల మంది బడికి వెళ్లనేలేదు!

Nov 1 2016 1:07 AM | Updated on Jul 11 2019 5:01 PM

2011నాటి దేశ జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 5 నుంచి 19 ఏళ్ల వయసున్న వారిలో 6.54 కోట్ల మంది అసలు పాఠశాలకే వెళ్లలేదు.

న్యూఢిల్లీ: 2011నాటి దేశ జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 5 నుంచి 19 ఏళ్ల వయసున్న వారిలో 6.54 కోట్ల మంది అసలు పాఠశాలకే వెళ్లలేదు. గత దశాబ్దంలో మరో 4.49 కోట్ల పిల్లలు బడిని మధ్యలోనే మానేశారు. దేశంలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 38.01 కోట్ల మంది ఉంటే వారిలో 26.98 కోట్ల మంది విద్యాలయాలకు వెళ్తున్నారు.

ఇదే వయసు వారిలో 65.7 లక్షల మందికి వికలాంగులు. వారిలో 17.5 లక్షల మంది ఎప్పుడూ బడికి వెళ్లలేదు. 8 లక్షల మంది పాఠశాలను మధ్యలోనే మానేయగా, 40.2 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 22.8 లక్షల మంది బాలురు. 17.4 లక్షల మంది బాలికలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement