అతిపెద్ద మురికివాడలో ‘కరోనా’ అలజడి | 55 COVID19 positive cases in Dharavi area of Mumbai | Sakshi
Sakshi News home page

అతిపెద్ద మురికివాడలో ‘కరోనా’ అలజడి

Apr 14 2020 10:49 AM | Updated on Apr 25 2020 8:34 AM

55 COVID19 positive cases in Dharavi area of Mumbai - Sakshi

ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావిలో కరోనావైరస్‌ వ్యాప్తి కలకలం రేపుతోంది. 10 లక్షలకుపైగా ప్రజలు నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో కొత్తగా  ఆరుగురికి కరోనా సోకగా, ఇద్దరు మరణించారని బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ పేర్కొంది. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు ధారావిలో మొత్తం 55 మందికి కరోనా సోకగా, ఏడుగురు మృతిచెందారు.(వ్యాక్సిన్ వ‌చ్చేవ‌ర‌కు ముప్పు త‌ప్ప‌దు)

ఇప్పటికే ధారవి చుట్టూ బారికేడ్‌లు ఏర్పాటు చేసిన అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఐసోలేషన్, క్వారంటైన్‌ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో అత్యంత సమీపంలో ఇళ్లు ఉండటంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటే దాన్ని నిరోధించడం కష్టమైన పని అని అధికారులు ఆందోళన చెందుతున్న వేళ కొత్తగా కరోనా కేసులు నిర్ధారణ కావడం అలజడి రేపుతోంది. (మే 3 వరకు లాక్‌డౌన్‌ : మోదీ)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement