Sakshi News home page

24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు

Published Thu, May 14 2020 9:15 AM

3,722 new coronavirus cases reported in a day in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వైరస్‌ సోకి 134 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం​ కరోనా కేసుల సంఖ్య 78,003కి చేరుకోగా.. మృతుల సంఖ్య 2,549కి చేరింది. దేశంలో ప్రస్తుతం 49,219 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 26,235 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. (9 రాష్ట్రాలు, యూటీల్లో జీరో కేసులు)

  • మహారాష్ట్రలో 25,922 పాజిటివ్ కేసులు, 975 మంది మృతి
  • గుజరాత్‌లో 9,267 పాజిటివ్ కేసులు, 566 మంది మృతి
  • తమిళనాడులో 9,227 పాజిటివ్ కేసులు, 64 మంది మృతి
  • ఢిల్లీలో 7,998 పాజిటివ్ కేసులు, 106మంది మృతి 

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా  కరోనా పాజిటివ్ కేసులు 44.24 లక్షలు దాటాయి. ఇప్పటివరకు కరోనాతో 2.97 లక్షల మంది మృతిచెందారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో  16.55 లక్షల మంది కోలుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మృతులు

  • అమెరికా: 14,29,709 పాజిటివ్ కేసులు, 85,171 మంది మృతి
  • స్పెయిన్‌ 2,71,095 పాజిటివ్ కేసులు, 27,104 మంది మృతి
  • రష్యా 2,42,271 పాజిటివ్ కేసులు, 2,212 మంది మృతి
  • ఇంగ్లండ్‌ 2,29,705 పాజిటివ్ కేసులు, 33,186 మంది మృత
  • ఇటలీ 2,22,104 పాజిటివ్ కేసులు, 31,106 మంది మృతి
  • బ్రెజిల్‌ 1,89,157 పాజిటివ్ కేసులు, 13,158 మంది మృతి
  • ఫ్రాన్స్‌ 1,78,060 పాజిటివ్ కేసులు, 27,074 మంది మృతి
  • జర్మనీ 1,74,098 పాజిటివ్ కేసులు, 7,861 మంది మృతి
  • టర్కీ 1,43,114 పాజిటివ్ కేసులు, 3,952 మంది మృతి
  • ఇరాన్‌ 1,12,725 పాజిటివ్ కేసులు, 6,783 మంది మృతి
  • చైనా 82,926 పాజిటివ్ కేసులు, 4,633 మంది మృతి
  • పెరు 76,306  పాజిటివ్ కేసులు, 2,169 మంది మృతి
  • కెనడా 72,278 పాజిటివ్ కేసులు, 5,302 మంది మృతి
  • బెల్జియం 53,981 పాజిటివ్ కేసులు, 8,843 మంది మృతి

Advertisement

What’s your opinion

Advertisement