ఎదురు కాల్పుల్లో ముగ్గరు ఉగ్రవాదులు, జవాను మృతి | 2 Terrorists Killed And 1 Jawan Martyred In Encounter In Pulwama Village | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో ముగ్గరు ఉగ్రవాదులు, జవాను మృతి

May 16 2019 8:27 AM | Updated on May 16 2019 9:01 AM

2 Terrorists Killed And 1 Jawan Martyred In Encounter In Pulwama village - Sakshi

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో భద్రతా దళాలకు.. ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఓ ఆర్మీ జవాన్‌ వీరమరణం పొందారు. పుల్వామాలోని దాలిపొర ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ విషయం గురించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘దాలిపోర ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం వచ్చింది. దాంతో ఆ ప్రాంతంలో కార్డన్‌ సర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాము. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఒక ఆర్మీ అధికారి మరణించారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామ’ని తెలిపారు. కాగా ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో దాలిపొర ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement