భారత్‌కు 25 వేలమంది బ్రిటన్ విద్యార్థులు | 25 Thousands of Indian students in Britain | Sakshi
Sakshi News home page

భారత్‌కు 25 వేలమంది బ్రిటన్ విద్యార్థులు

Jan 15 2015 6:57 AM | Updated on Jul 11 2019 5:23 PM

భారత్, బ్రిటన్‌ల మధ్య విద్యావ్యవస్థలో భాగస్వామ్య సంబంధాలు మెరుగుపరచడంలో...

పాట్నా: భారత్, బ్రిటన్‌ల మధ్య విద్యావ్యవస్థలో భాగస్వామ్య సంబంధాలు మెరుగుపరచడంలో భాగంగా రానున్న ఇదేళ్లలో దాదాపు 25 వేలమంది బ్రిటన్ విద్యార్థులు భారత యూనివర్సిటీల్లో చదవనున్నట్లు సీనియర్ బ్రిటిష్ దౌత్యాధికారి ఆండ్రూ సోపెర్ బుధవారం విలేకర్లకు తెలిపారు. భారత్‌లో అనేక మంచి విద్యాసంస్థలున్నాయన్నారు. ఇక్కడ చదవడం వల్ల బ్రిటన్ విద్యార్థులు వారు ఎంచుకున్న రంగంలో రాణించే అవకాశముందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement