పాపను కిడ్నాప్ చేసి 25 కోట్లు అడిగారు! | 25 Crores Sought For Her Return. Bihar Schoolgirl Found In Nepal | Sakshi
Sakshi News home page

పాపను కిడ్నాప్ చేసి 25 కోట్లు అడిగారు!

Aug 8 2016 1:27 PM | Updated on Jul 18 2019 2:02 PM

పాపను కిడ్నాప్ చేసి 25 కోట్లు అడిగారు! - Sakshi

పాపను కిడ్నాప్ చేసి 25 కోట్లు అడిగారు!

బిహార్ లోని కతిహార్ నగరం నుంచి గతవారం కిడ్నాపైన చిన్నారి స్పర్శ సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది.

పట్నా: బిహార్ లోని కతిహార్ నగరం నుంచి గతవారం కిడ్నాపైన చిన్నారి స్పర్శ సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. నేపాల్ లో ఆమెను కనుగొన్నారు. స్థానికంగా పెద్ద వ్యాపారస్తుడైన భాను అగర్వాల్ కుమార్తె అయిన స్పర్శను స్కూల్ నుంచి వస్తుండగా ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారు. రూ. 25 కోట్లు ఇస్తేనే చిన్నారిని విడిచిపెడతామని భాను అగర్వాల్ కు రెండు రోజుల తర్వాత దుండగులు ఫోన్ చేశారు.

ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ నరేశ్ యాదవ్ కుమారుడు సంతోష్ యాదవ్ ఫోన్ నుంచి కాల్ వచ్చినట్టు గుర్తించిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కిడ్నాపర్ల జాడ తెలిసింది. పాపను నేపాల్ లోని విరాట్ నగర్ సమీపంలో దాచినట్టు కనుగొన్నారు. నేపాల్ పోలీసులు చిన్నారిని సురక్షితంగా విడిపించి సోమవారం ఉదయం సరిహద్దు వద్ద తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement