లోయలో పడిన బస్సు, 28 మంది మృతి | 20 killed after bus falls in gorge in Himachalpradesh | Sakshi
Sakshi News home page

లోయలో పడిన బస్సు, 28 మంది మృతి

Jul 20 2017 11:03 AM | Updated on Sep 5 2017 4:29 PM

లోయలో పడిన బస్సు, 28 మంది మృతి

లోయలో పడిన బస్సు, 28 మంది మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చేరువలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

సిమ్లా: సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చేరువలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సోలన్‌ నుంచి కిన్నూర్‌కు 40 మంది ప్రయాణీకులతో ఓ బస్సు బయల్దేరింది.

బస్సు రామ్‌పూర్‌ వద్ద కొండలపై ఉన్న ఘాట్‌లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న సట్లెజ్‌ నది పరివాహక ప్రాంత లోయలో పడిపోయింది. ఎత్తు నుంచి బస్సు దొర్లుతూ పడటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ తొమ్మిది మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement