breaking news
himachapradesh
-
హృదయ విదారక ఘటన: నవజాత శిశువుని మెట్లపై వదిలేశారు
సిమ్లా: పిల్లలు కలగాలని కొందరు దంపతులు ఆసుపత్రుల చుట్టు తిరుగుతుంటే.. మరికొందరు గుళ్ల చుట్టు తిరుగుతూ దేవుడికి మొక్కులు చెల్లింస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే, దీనికి భిన్నంగా కొంత మంది మాత్రం.. తమకు పుట్టిన సంతానాన్ని వేర్వేరు కారణాలతో వదిలివేస్తున్న సంఘటనలను తరచుగా వార్తల్లో చూస్తుంటాం. నిన్న(సోమవారం) జరిగిన ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమచల్ ప్రదేశ్‌లోని సోలాన్ అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే ఆలయం ముందు నుంచి స్థానికులు వాకింగ్‌కు వెళ్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఒక చిన్నారి ఏడుపు వాకర్లకు వినిపించింది. దీంతో వారు అక్కడికి వెళ్లి చూశారు. ఆలయం మెట్లమీద ఒక నవజాత ఆడ శిశువు టవల్లో చుట్టి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ చిన్నారి చలికి వణికిపోతుంది. వెంటనే స్థానికులు ఆలయ పూజారీ బ్రహ్మనంద్కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి ఏవరో.. అని ఆరాతీస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నెలలు నిండకుండానే చిన్నారి పుట్టడం వలన వదిలేసుంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ పూజారీ బ్రహ్మనంద్ చిన్నారిని.. తాను దత్తత తీసుకుని పెంచుకుంటానని గ్రామస్తులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: బిడ్డ వేదనను చూడ లేక.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి.. -
లోయలో పడిన బస్సు, 28 మంది మృతి
సిమ్లా: సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చేరువలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సోలన్ నుంచి కిన్నూర్‌కు 40 మంది ప్రయాణీకులతో ఓ బస్సు బయల్దేరింది. బస్సు రామ్‌పూర్ వద్ద కొండలపై ఉన్న ఘాట్‌లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న సట్లెజ్ నది పరివాహక ప్రాంత లోయలో పడిపోయింది. ఎత్తు నుంచి బస్సు దొర్లుతూ పడటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ తొమ్మిది మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.