లోయలో పడ్డ బస్సు, 18మంది మృతి | 18 killed in Himachal Pradesh as bus falls into gorge near Bindravani in Mandi district | Sakshi
Sakshi News home page

లోయలో పడ్డ బస్సు, 18మంది మృతి

Nov 5 2016 3:08 PM | Updated on Sep 4 2017 7:17 PM

లోయలో పడ్డ బస్సు, 18మంది మృతి

లోయలో పడ్డ బస్సు, 18మంది మృతి

హిమాచల్ ప్రదేశ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

లోయలో పడ్డ బస్సు, 18మంది మృతి (others)

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 18మంది దుర్మరణం చెందగా, మరో 25మంది  గాయపడ్డారు. మండి జిల్లా బింద్రావని సమీపంలో ఓ ప్రయివేట్ బస్సు  అదుపు తప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా  మొత్తం 40మంది ప్రయాణికులు ఉన్నారని, బస్సులో మండి నుంచి కులూ వెళుతుండగా  ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే గాయపడినవారికి ఉచితంగా వైద్యం అందించనున్నట్లు రవాణామంత్రి జీఎస్ బలి తెలిపారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement