మరుగుదొడ్డిలో కిలో బంగారం! | 1 kg gold hidden in lavatory of SpiceJet | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్డిలో కిలో బంగారం!

May 26 2016 10:34 AM | Updated on Sep 4 2017 12:59 AM

మరుగుదొడ్డిలో కిలో బంగారం!

మరుగుదొడ్డిలో కిలో బంగారం!

బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తి కస్టమ్స్ అధికారుల తనిఖీలకు భయపడి కిలో బంగారాన్ని విమానంలోని మరుగుదొడ్డిలో దాచి ఉంచాడు.

న్యూఢిల్లీ: విమానంలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తి కస్టమ్స్ అధికారుల తనిఖీలకు భయపడి కిలో బంగారాన్ని విమానంలోని మరుగుదొడ్డిలో దాచి ఉంచాడు. విమాన సిబ్బంది చాకచక్యంగా తనిఖీలు నిర్వహించడంతో అతగాడి బండారం బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. గురువారం దుబాయ్ నుంచి కొచ్చికి చేరుకున్న స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా పలుమార్లు విమానంలోని మరుగుదొడ్డి(లావెటరి)కి వెళ్లడం గమనించిన విమానసిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లావెట్రీలోని టిష్యూ పేపర్ బాక్స్ వెనుకాల పేపర్లో చుట్టి దాచి ఉంచిన కిలో బంగారు కడ్డీలను సిబ్బంది కనిపెట్టారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement