రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో ‘ధర్మప్రభు’

Yogi Babu As Yamaraja In Political Satire Dharmaprabhu - Sakshi

ఇప్పుడు కోలీవుడ్‌లో మంచి స్వింగ్‌లో ఉన్న హాస్యనటుడు యోగిబాబు. వడివేలు, వివేక్‌ వంటి వారి తరం తరువాత సూరి, సతీశ్‌ లాంటి వారు కామెడీ నటులుగా వెలుగులోకి వచ్చారు. అయితే వారిని కూడా పక్కన పెట్టేశాడు నటుడు యోగిబాబు. ఇతను లేని చిత్రాలనే లెక్క చెప్పగలం.. నటిస్తున్న చిత్రాల సంఖ్యను చెప్పడం కష్టమే అవుతుంది. దాదాపు హీరో స్థాయి పాత్రల్లో నటించేస్తున్నాడు. తాజాగా రజనీకాంత్‌ కొత్త చిత్రంలో కూడా నటించడానికి సిద్ధం అవుతున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో యోగిబాబు ప్రధానంగా టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ధర్మప్రభు. ఇంతకుముందు విమల్, వరలక్ష్మీశరత్‌కుమార్‌ జంటగా నటించి న కన్నిరాశి చిత్ర దర్శకుడు ముత్తుకుమరన్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ధర్మప్రభు. ఈ చిత్రంలో యోగిబాబు, కరుణాకరన్, రాధారవి, మనోబాలా, జననీఅయ్యర్‌ ప్రధా న పాత్రల్లో నటించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.

ఇది యముడు ప్రధాన ఇతివృత్తంగా వినోదాన్ని రంగరించి తెరకెక్కుతున్న చిత్రం. యోగిబాబు యమ ధర్మరాజుగా నటిస్తున్నారు. చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ టీజర్‌ను చూస్తుంటే సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం లోని అన్నాడీఎంకేను, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలను సంధించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ధర్మప్రభు చిత్రంలో యమలోకంలో యోగిబాబు మా ట్లాడుతూ భూలోకంలో అర్హత లేనివారికి పదవులు దక్కుతున్నాయి.  ఇప్పుడు యమలోకంలో కూడానా? ఇక్కడ అర్హత కలిగినవారే పదవుల్లో ఉన్నారు. అమ్మ పోతే, చిన్నమ్మ, నాన్నపోతే, చిన్నాన్న, అకౌంట్‌లో డబ్బు వేస్తానని చెప్పి అలంకారంగా తయారవుతున్నారు, లాంటి సంభాషణలు చిత్రంలో చోటుచేసుకున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోది ఎన్నికల ముందు దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఎకౌంట్‌లో రూ.5 లక్షలు వేస్తానని వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా అమ్మ.చిన్నమ్మ లాంటి సంభాషణలు అన్నాడీఎంకేను విమర్శించే విధంగా ఉన్నాయి. ఇలా రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో రూపొందుతున్న ధర్మప్రభు చిత్రం విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top