వీళ్లు చాలా హాట్! | XXX The Return Of Xander Cage: Deepika Padukone's latest | Sakshi
Sakshi News home page

వీళ్లు చాలా హాట్!

Jun 6 2016 11:11 PM | Updated on Sep 4 2017 1:50 AM

వీళ్లు చాలా హాట్!

వీళ్లు చాలా హాట్!

బాలీవుడ్‌లో దీపికా పదుకొనే ఏ హీరో సరసన నాయికగా బాగుంటారు? అనే ప్రశ్న వేస్తే.. షారుఖ్‌ఖాన్, రణబీర్ కపూర్,

 బాలీవుడ్‌లో దీపికా పదుకొనే ఏ హీరో సరసన నాయికగా బాగుంటారు? అనే ప్రశ్న వేస్తే.. షారుఖ్‌ఖాన్, రణబీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ లాంటి హీరోల పేర్లను చెప్చొచ్చు. వీళ్లతో దీపిక కెమిస్ట్రీ బాగుంటుంది. హాలీవుడ్‌లో మాత్రం దీపికాకు బెస్ట్ జోడీ విన్ డీజిల్ అని  సోషల్ మీడియా కోడై కూస్తోంది.

తొలిసారిగా దీపికా పదుకొనే నటిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘ఏజెంట్ త్రిబులెక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’. ‘ఏజెంట్ త్రిబులెక్స్’ అనే హాలీవుడ్ సిరీస్‌లో మూడో సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరో ఏజెంట్  త్రిబులెక్స్ పాత్రధారి విన్ డీజిల్ ప్రేయసిగా సెరీనా పాత్రలో దీపిక చేస్తున్నారు. ఇప్పటి వరకూ విడుదలైన ఈ చిత్రం స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.  సోమవారం విడుదలైన కొత్త స్టిల్‌లో దీపిక, విన్ డీజిల్‌ని చూసి ‘వీళ్లు హాట్ గురూ’ అనకుండా ఉండలేకపోతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement