తమన్నా ఇంట పెళ్లి సందడి | When will Tamanna get married? | Sakshi
Sakshi News home page

తమన్నా ఇంట పెళ్లి సందడి

Jul 2 2017 11:51 PM | Updated on Oct 16 2018 8:03 PM

తమన్నా ఇంట పెళ్లి సందడి - Sakshi

తమన్నా ఇంట పెళ్లి సందడి

హెడ్డింగ్‌ చూసి, తమన్నా పెళ్లి కుదిరిందని కొందరు ఊహించుకునే అవకాశం ఉంది. తమన్నాను ఆరాధించే కుర్రాళ్లు మాత్రం అప్పుడే తమన్నాకి పెళ్లా? అని షాకవుతారు.

హెడ్డింగ్‌ చూసి, తమన్నా పెళ్లి కుదిరిందని కొందరు ఊహించుకునే అవకాశం ఉంది. తమన్నాను ఆరాధించే కుర్రాళ్లు మాత్రం అప్పుడే తమన్నాకి పెళ్లా? అని షాకవుతారు. అయితే ఎవరూ షాకవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే పెళ్లి తమన్నాది కాదు.. ఆమె సోదరుడు ఆనంద్‌ భాటియాది.

ఆన్‌ స్క్రీన్, ఆఫ్‌ స్క్రీన్‌ దాదాపు మోడ్రన్‌ దుస్తుల్లో కనిపించే తమన్నా చేతి నిండా మెహందీ.. సంప్రదాయ దుస్తులు.. మెడనిండా నగలు ధరించి సోదరుడి పెళ్లి కోసం గ్రాండ్‌గా తయారయ్యారు. పెళ్లి వేడుకలో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యారు. అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్‌ భాటియా వివాహాన్ని తమన్నా ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయాలని నిర్ణయించుకుంది. ఈ పెళ్లి కోసం తమన్నా షూటింగ్‌కి సెలవు పెట్టారు. అందంగా ముస్తాబై, తన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, ‘నా బ్రదర్‌ పెళ్లిలో..’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. మరి, తమ్మూ పెళ్లిపీటలు ఎక్కే ఘడియలు ఎప్పుడొస్తాయో? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement