breaking news
Anand Bhatia
-
సోదరుడిని మిస్ అవుతోన్న మిల్క్ బ్యూటీ
-
ఆనంద్‌ను మిస్ అవుతోన్న తమన్నా
లాక్డౌన్ కాలాన్ని సెలబ్రిటీలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూ పాతకాలపు జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ తమన్నా భాటియా కూడా గతంలో సోదరుడు ఆనంద్‌తో దిగిన చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ప్రస్తుతం తమన్నా అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె సోదరుడు ఇండియాలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోదరుడికి దూరంగా ఉండటంతో అతన్ని మిల్క్ బ్యూటీ మిస్ అవుతోందట. ‘ఆరోజుల్లో ఇద్దరం చాలా గొడవపడేవాళ్లం. మిస్ యు ఆనంద్ భాటియా’ అని క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలో తమన్నా జుట్టును ఆనంద్ మీసంలా పెట్టుకుంటున్నాడు. (అవకాశం వస్తే.. వద్దంటానా? : తమన్నా) View this post on Instagram #Flashback to the days when we use to annoy the hell outta each other 😂 Missing you @anandsbhatia. How I wish you were in India during this lockdown! ❤️ #SiblingLove #MissYou #Memories A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on Apr 24, 2020 at 5:31am PDT లాక్డౌన్లో తమన్నా ఫిట్నెస్ను కోల్పోకుండా డిజిటల్ వర్కౌట్లు చేస్తోంది. అంతేగాక వంటలు తయారు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ముంబై భామ ‘సీటీమార్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా కనిపించనున్నారు. కబడ్డీ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సంపతి నంది దర్శకత్వంలో ఇప్పటికే రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాల్లో తమన్నా పనిచేశారు. (గుడ్‌న్యూస్.. మరికొన్ని ఆంక్షలు సడలింపు) View this post on Instagram BAKE - BINGE - REPEAT 🧁 These banana walnut muffins are home made, gluten, dairy and sugar free and are a healthy alternative to my cupcake cravings 😛 #LockdownDaysWithTammy #QuarentineCooking #BakeYourWorldHappy #Muffins A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on Apr 23, 2020 at 5:00am PDT View this post on Instagram -
తమన్నా ఇంట పెళ్లి సందడి
హెడ్డింగ్ చూసి, తమన్నా పెళ్లి కుదిరిందని కొందరు ఊహించుకునే అవకాశం ఉంది. తమన్నాను ఆరాధించే కుర్రాళ్లు మాత్రం అప్పుడే తమన్నాకి పెళ్లా? అని షాకవుతారు. అయితే ఎవరూ షాకవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే పెళ్లి తమన్నాది కాదు.. ఆమె సోదరుడు ఆనంద్ భాటియాది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ దాదాపు మోడ్రన్ దుస్తుల్లో కనిపించే తమన్నా చేతి నిండా మెహందీ.. సంప్రదాయ దుస్తులు.. మెడనిండా నగలు ధరించి సోదరుడి పెళ్లి కోసం గ్రాండ్‌గా తయారయ్యారు. పెళ్లి వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్ భాటియా వివాహాన్ని తమన్నా ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ పెళ్లి కోసం తమన్నా షూటింగ్‌కి సెలవు పెట్టారు. అందంగా ముస్తాబై, తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘నా బ్రదర్ పెళ్లిలో..’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. మరి, తమ్మూ పెళ్లిపీటలు ఎక్కే ఘడియలు ఎప్పుడొస్తాయో? వెయిట్ అండ్ సీ.