ఆనంద్‌ను మిస్‌ అవుతోన్న తమన్నా | Tamannaah Bhatia Missing Her Brother In Lockdown | Sakshi
Sakshi News home page

సోదరుడిని మిస్‌ అవుతోన్న మిల్క్‌ బ్యూటీ

Apr 25 2020 10:20 AM | Updated on Apr 25 2020 12:12 PM

Tamannaah Bhatia Missing Her Brother In Lockdown - Sakshi

లాక్‌డౌన్‌ కాలాన్ని సెలబ్రిటీలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూ పాతకాలపు జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. తాజాగా  హీరోయిన్‌ తమన్నా భాటియా కూడా గతంలో సోదరుడు ఆనంద్‌తో దిగిన చిత్రాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే ప్రస్తుతం తమన్నా అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె సోదరుడు ఇండియాలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోదరుడికి దూరంగా ఉండటంతో అతన్ని మిల్క్‌ బ్యూటీ మిస్‌ అవుతోందట. ‘ఆరోజుల్లో ఇద్దరం చాలా గొడవపడేవాళ్లం. మిస్‌ యు ఆనంద్‌ భాటియా’ అని క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటోలో తమన్నా జుట్టును ఆనంద్‌ మీసంలా పెట్టుకుంటున్నాడు. (అవకాశం వస్తే.. వద్దంటానా? : తమన్నా)

లాక్‌డౌన్‌లో తమన్నా ఫిట్‌నెస్‌ను కోల్పోకుండా డిజిటల్‌ వర్కౌట్లు చేస్తోంది. అంతేగాక వంటలు తయారు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ ముంబై భామ ‘సీటీమార్’‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్‌ హీరోగా కనిపించనున్నారు. కబడ్డీ బ్యాగ్రౌండ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సంపతి నంది దర్శకత్వంలో ఇప్పటికే రచ్చ, బెంగాల్‌ టైగర్‌ సినిమాల్లో  తమన్నా పనిచేశారు. (గుడ్‌న్యూస్‌.. మరికొన్ని ఆంక్షలు సడలింపు)

Advertisement
 
Advertisement
Advertisement