గుడ్‌న్యూస్‌.. మరికొన్ని ఆంక్షలు సడలింపు

Centrall allows some shops to reopen from Saturday Amind Lockdown - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ను నుంచి ప్రజలకు కొంతమేర ఉపశమనం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ఆంక్షల నుంచి మరికొన్ని సడలింపులను ఇచ్చింది. నిత్యావసరాల్లో భాగంగా ప్రజలకు అవసరమైన గూడ్స్‌ సరఫరకు కేంద్రం అనుమతినిచ్చింది. అలాగే నాన్‌ హాట్‌స్పాట్‌ ఏరియాలోని మున్సిపాలిటీ పరిధిలో గల దుకాణాలను కూడా తెరవబడతాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిమితిలో ఉన్న మార్కెట్ సముదాయాలపై మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం అర్థరాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే తెరుచుకునే షాపులకు మాత్రం షరతులు కూడా విధించింది. 

షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవాలని తెలిపింది. హాట్‌ స్పాట్‌, కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్న చోటమాత్రం ఏషాపులూ తెరవడానికి వీలేద్దని కేంద్ర విడుదల చేసిన జీవో పేర్కొంది. కాగా ఇప్పటి వరకు కిరాణా దుకాణాలు, నిత్యవసర, అత్యవసర, మందుల, ఫార్మసీలకు మాత్రమే అనుమతి ఉంది. తాజా సడలింపులతో స్టేషనరీ,  బ్యూటీ సెలూన్స్‌, డ్రైక్లీనర్స్‌, ఎలక్టికల్‌ స్టోర్స్‌ తెరుచుకోవ​చ్చు. అయితే  ఇవన్నీ ఆయా రాష్ట్రా ప్రభుత్వాల అనుమతితో మాత్రమే జరగాలని కేంద్ర స్పష్టం చేసింది.

మరోవైపు దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు. మరికొంతకాలంపాటు వీటిపై ఆంక్షలు కొనసాగనున్నాయి. అయితే తెరుచుకోబడిన ఆయా షాపుల్లో కేవలం​ 50శాతం మంది సిబ్బంధి మాత్రమే విధులు నిర్వర్తించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ముఖాలకు మాస్క్‌‌లు, శానిటైజర్లు, సామాజిక దూరం తప్పనిసరి పాటించాలని పేర్కొంది. కాగా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఉండేందుకు కేంద్ర ఇప్పటికే పలు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పలు షాపులకు అనుమతి ఇచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top