'మా ఆయనకు కూడా అవి చాలా ఇష్టం' | When Kareena used to eat ice cream hiding from mother! | Sakshi
Sakshi News home page

'మా ఆయనకు కూడా అవి చాలా ఇష్టం'

Feb 26 2016 12:29 PM | Updated on Apr 3 2019 6:23 PM

'మా ఆయనకు కూడా అవి చాలా ఇష్టం' - Sakshi

'మా ఆయనకు కూడా అవి చాలా ఇష్టం'

తనకు ఐస్ క్రీం తినడమంటే చాలా ఇష్టమని ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ చెప్పింది. స్కూల్లో చదువుకునే రోజుల్లో దానికోసం ఎప్పుడూ తన పాకెట్లో డబ్బులు ఉంచుకునేదాన్నని వివరించింది.

ముంబయి: తనకు ఐస్ క్రీం తినడమంటే చాలా ఇష్టమని ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ చెప్పింది. స్కూల్లో చదువుకునే రోజుల్లో దానికోసం ఎప్పుడూ తన పాకెట్లో డబ్బులు ఉంచుకునేదాన్నని వివరించింది. ముంబయిలో ఓ కొత్త ఫ్లేవర్ తో మాగ్నం ఐస్ క్రీం ను ప్రారంభించిన సందర్భంగా ఆమె తన అనుభూతులను మీడియాతో పంచుకుంది.

చీట్ ఫుడ్లలో తనకు బాగా నచ్చే ఫుడ్ ఐస్ క్రీమేనని, దానిని తన తల్లికి తెలియకుండా తినేదాన్నని చెప్పింది. 'నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఇంటికి వెళ్లే ముందు వెంటనే ఓ ఐస్ క్రీం కొనుక్కొని తినేదాన్ని. ఎందుకంటే మా అమ్మ ఐస్ క్రీం తినడానికి అనుమతించేది కాదు. నా భర్త సైఫ్ అలీఖాన్ కు కూడా అవంటే చాలా ఇష్టం. ఆయన బాగా తింటాడు. ప్రతిసారి నువ్వు ఇప్పటికే రెండు ఐస్ క్రీం లు తిన్నావ్ అని గుర్తు చేస్తుంటాను' అంటూ ముచ్చటపడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement