చెర్రీపై ఉపాసనకు కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా? | when I’m annoyed with cherry, I look at pic, says upasana | Sakshi
Sakshi News home page

చెర్రీపై ఉపాసనకు కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా?

Nov 9 2017 1:53 PM | Updated on Nov 9 2017 1:54 PM

when I’m annoyed with cherry, I look at pic, says upasana - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రాంచరణ్‌, ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి దాంపత్య జీవితం హాయిగా సాగిపోతోంది. ఎవరేమన్నా.. పట్టించుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వీరు ముందుకు సాగుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన.. తాజాగా చెర్రీపై తన ప్రేమను చాటే ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. చెర్రీ చిన్నప్పటి క్యూట్‌ ఫొటోను షేర్‌ చేసిన ఉపాసన.. అతనికి తనకు కోపం వస్తే.. వెంటనే ఈ ముద్దొచ్చే ఫొటోను చూస్తానని, వెంటనే కరిగిపోయి.. కోపం మాటుమాయం అవుతుందని పేర్కొంది. రాంచరణ్‌పై తన ప్రేమను చాటుతూ ఓ లవ్‌ ఎమోజీని పోస్టుచేసింది. మొత్తానికి చెర్రీపై అమితమైన ప్రేమను చాటుతూ.. ఉపాసన పెట్టిన పోస్టు మెగా అభిమానులను అలరిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement