వచ్చే ఏడాది పెళ్లా..? | Wedding bells for Anushka Shetty? | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది పెళ్లా..?

Sep 17 2014 11:00 PM | Updated on Sep 2 2017 1:32 PM

వచ్చే ఏడాది పెళ్లా..?

వచ్చే ఏడాది పెళ్లా..?

‘ఇంతకీ నీ పెళ్లెప్పుడు?’... పెళ్లీడులో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రశ్న ఇది. సినిమా తారలైతే దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఈ ప్రశ్నను తప్పించుకోలేరు. అనుష్క ఈ జాబితాలోకే వస్తారు.

 ‘ఇంతకీ నీ పెళ్లెప్పుడు?’... పెళ్లీడులో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రశ్న ఇది. సినిమా తారలైతే దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఈ ప్రశ్నను తప్పించుకోలేరు. అనుష్క ఈ జాబితాలోకే వస్తారు. పెళ్లి గురించి అడిగితే... ‘మీ అందరికీ చెప్పే చేసుకుంటా’ అని చెప్పుకుంటూ వచ్చారు అనుష్క. ఇప్పుడు పెళ్లి గురించి ఓ నిర్ణ యానికొచ్చేశారని సమాచారం.
 
  ఇటీవల ఓ కొత్త దర్శకుడు అనుష్కకు కథ చెప్పడానికి వెళ్లాడట. ‘లింగా’ షూటింగ్ లొకేషన్లో వీరి మీటింగ్ జరిగిందని తెలిసింది. కథ అనుష్కకు విపరీతంగా నచ్చేసిందట. అయినప్పటికీ పచ్చజెండా ఊపలేదని వినికిడి. ‘‘నేను ‘బాహుబలి’ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అందుకని కొత్త సినిమాలేవీ అంగీ కరించే పరిస్థితిలో లేను’’ అని అనుష్క ఆ దర్శకునితో అన్నట్లు భోగట్టా. ‘బాహుబలి’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. సో.. వచ్చే ఏడేది అనుష్క పెళ్లి చేసుకుంటారా? ఏమో ఓ ఏడాది ఆగుదాం.. విషయం తెలిసిపోతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement