కన్నప్ప కోసం

Vishnu Manchu in New Zealand to scout locations for Kannappa  - Sakshi

కన్నప్ప తిరగబోయే ప్రదేశాల వేటలో బిజీబిజీగా ఉన్నారు మంచు విష్ణు. అందుకోసం న్యూజిల్యాండ్, సిడ్నీను చుట్టేస్తున్నారు. శివ భక్తుడు భక్త కన్నప్ప కథ ఆధారంగా మంచు విష్ణు నటించి, నిర్మించనున్న చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన లొకేషన్స్‌ను ప్రస్తుతం వెతుకుతున్నారు మంచు విష్ణు. ఇప్పటివరకూ ఎవ్వరూ షూట్‌ చేయని, సరికొత్త లొకేషన్స్‌లో ఈ సినిమాను షూట్‌ చేయాలని భావిస్తోందట చిత్రబృందం. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉండే ఈ చిత్రానికి హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేయనున్నారు. ఈ సినిమాకు ఎవరు దర్శకుడు, మిగతా సాంకేతిక నిపుణులు వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top