‘జయసూర్య’ ఏం చేశాడు? | Vishal's Jayasurya is ready for Released | Sakshi
Sakshi News home page

‘జయసూర్య’ ఏం చేశాడు?

Sep 2 2015 11:56 PM | Updated on Oct 30 2018 5:58 PM

‘జయసూర్య’ ఏం చేశాడు? - Sakshi

‘జయసూర్య’ ఏం చేశాడు?

జయసూర్య నిజాయితీపరుడైన పోలీసాఫీసర్. వరుసగా జరుగుతున్న హత్యలు అతనికి సవాలుగా నిలుస్తాయి. ఆ హత్యల వెనక మిస్టరీని ఎలా ఛేదించాడు?

జయసూర్య నిజాయితీపరుడైన పోలీసాఫీసర్. వరుసగా జరుగుతున్న హత్యలు అతనికి సవాలుగా నిలుస్తాయి. ఆ హత్యల వెనక మిస్టరీని ఎలా ఛేదించాడు? అనే కథాంశంతో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పాయుమ్ పులి’. విశాల్, కాజల్ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి, ఎస్. నరసింహ ప్రసాద్ ‘జయసూర్య’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సుశీంద్రన్ దర్శకుడు. ఈ శుక్రవారం తమిళ, తెలుగు వెర్షన్‌లు రిలీజ్ కానున్నాయి. ‘‘ఇందులో విశాల్ లుక్, బాడీ లాంగ్వేజ్  సూపర్బ్. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రం ఇది’’ అని నిర్మాతలు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement