'అదిరింది'.. ఈ వారం కూడా డౌటే..!

Vijay starrer Adirindis release date postponed again

విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సూపర్ హిట్ సినిమా మెర్సల్. బీజేపీ నేతల అభ్యంతరాలు, డాక్టర్ల నిరసనల మధ్య భారీ వసూళ్లు సాధిస్తున్న మెర్సల్ సినిమా తెలుగునాట రిలీజ్ విషయంలో ఇబ్బందులు పడుతోంది. ముందుగా మెర్సల్ తో పాటు తెలుగు వర్షన్ ను కూడా ఈ నెల 18న రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. తరువాత ఒక్క రోజు ఆలస్యంగా 19న సినిమా రిలీజ్ అవుతున్నట్టుగా ప్రచారం జరిగింది.

చివరి నిముషంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాలేదంటూ సినిమాను 26కు వాయిదా వేశారు. ఈ లోగా మెర్సల్ టీం వివాదాలతో బిజీ కావటంతో తెలుగు వర్షన్ ను పట్టించుకోవటం మానేశారు. జాతీయ స్థాయిలో వివాదాస్పదమైన ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కానీ చిత్రయూనిట్ మాత్రం ఆస్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించటం లేదు. ఇంకా తెలుగు వర్షన్ సెన్సార్ పూర్తి కాలేదన్న టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు మరో రెండు రోజులు సమయం మాత్రమే ఉన్నా.. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభించలేదు. దీంతో ఈ వారం కూడా మెర్సల్ తెలుగు వర్షన్ అదిరింది రిలీజ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top