బాలీవుడ్‌కి అతిథిగా..! | Vijay Devarakonda Bollywood Entry Confirmed | Sakshi
Sakshi News home page

Dec 5 2018 11:04 AM | Updated on Dec 5 2018 11:04 AM

Vijay Devarakonda Bollywood Entry Confirmed - Sakshi

టాలీవుడ్ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అర్జున్‌ రెడ్డి తరువాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సక్సెస్‌లతో మెప్పించిన విజయ్‌ నోటా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. అదే జోరులో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్‌ రెడ్డి సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతుండటంతో అక్కడ కూడా విజయ్‌కు మంచి క్రేజ్‌ వచ్చింది.

అయితే ఇప్పట్లో బాలీవుడ్ లో హీరోగా ఆలోచన చేసే ఆలోచన విజయ్‌కు లేదని తెలుస్తోంది. కానీ త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో విజయ్‌ కనిపించనున్నాడట. ఓ భారీ చిత్రంలో విజయ్‌ అతిధి పాత్రలో కనిపించటం కన్ఫామ్ అయ్యిందన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా 2020లో రిలీజ్ కానుందన్న ప్రచారం జరుగుతోంది. మరి విజయ్‌ నటిస్తున్న ఆ బాలీవుడ్ మూవీ ఎదో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement