నేనే డబ్బింగ్‌ చెబుతా : విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda About Tamil Debut Nota | Sakshi
Sakshi News home page

Mar 10 2018 10:39 AM | Updated on Mar 10 2018 10:39 AM

Vijay Devarakonda About Tamil Debut Nota - Sakshi

‘నోటా’ చిత్ర ప్రెస్‌మీట్‌లో హీరో విజయ్‌ దేవరకొండ

తమిళసినిమా: తమిళం నేర్చుకుని తన చిత్రానికి తానే డబ్బింగ్‌ చెబుతానని తెలుగు యువ నటుడు విజయ్‌ దేవరకొండ తమిళ ప్రేక్షకులకు మాట ఇచ్చారు. ఈయనిప్పుడు నోటా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఈ సందర్భంగా గురువారం  సాయంత్రం తేనాంపేటలోని నక్షత్ర హోటల్‌లో చిత్ర యూనిట్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టైటిల్‌ను ప్రకటించారు. నిర్మాత జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ దర్శకుడు ఆనందశంకర్‌తో ఒక చిత్రం చేయాలని భావించానని మంచి కథ లభించడంతో చిత్రాన్ని తెరకెక్కిస్తునట్టు చెప్పారు.

తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ హక్కులను దర్శకుడు బాలా పొందారని, ఆ చిత్రం తెలుగు వెర్షనే చెన్నై, చెంగల్‌పట్టు ఏరియాల్లో రూ.3కోట్లు వసూలు చేసిందని తెలిపారు. చిత్ర హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ దర్శకుడు ఆనందశంకర్‌ చెప్పిన కథ విని ఇలాంటి కథే తనకు సూట్‌ అవుతుందని భావించి చిత్రానికి అంగీకరించానని తెలిపారు. ఈ చిత్రం కోసం తమిళ భాషను నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెబుతానని తమిళ ప్రేక్షకులకు మాట ఇస్తున్నానని విజయ్‌ దేవరకొండ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement