బిగిల్‌ కొట్టు

vijay bigil second look release - Sakshi

ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ప్రత్యర్థులను హడలెత్తించేలా ఆడారు తమిళ నటుడు విజయ్‌. ఈ ఆట ఈ ఏడాది దీపావళికి వెండితెరపైకి వస్తుంది. అట్లీ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా రూపొందుతున్న సినిమాకు ‘బిగిల్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే శనివారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్, సెకండ్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్స్‌ చూస్తుంటే  విజయ్‌ క్యారెక్టర్‌లో మూడు నాలుగు షేడ్స్‌ ఉంటాయని అర్థం అవుతోంది. ఇక్కడున్న ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ఒక గెటప్‌లో యంగ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా కనిపిస్తున్న విజయ్, ఇంకో లుక్‌లో కత్తి పట్టుకుని మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి సినిమా విడుదల కానుంది. అన్నట్లు.. ‘బిగిల్‌’ అంటే విజిల్‌ అని అర్థం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top