అవును.. నేను సింగిల్‌..

Vicky Kaushal Says About Breakup Rumours With Harleen Sethi - Sakshi

ముంబై: ప్రముఖ నటి హర్లీన్‌ సేథీతో తాను విడిపోయినట్లు వస్తున్న వార్తలపై బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ స్పందించాడు. బాలీవుడ్‌ ప్రేమజంట అయిన విక్కీ కౌశల్‌, హర్లీన్‌ సేథీల మధ్య గత కొంతకాలంగా దూరం పెరిగిపోయిందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో హర్లీన్‌, విక్కీ కౌశల్‌ను అన్‌ఫాలో చేసినప్పటి నుంచి వీరిద్దరు విడిపోయినట్లుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా హిందుస్తాన్‌ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వూలో హర్లీన్‌తో తాను తెగదెంపులు చేసుకున్నట్టు విక్కీ కౌశల్‌ ధ్రువీకరించాడు.

హర్లీన్‌ సేథీతో తన బంధం తెగిపోయిందని ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. ‘అవును నిజమే నేను ఒంటరిగానే ఉన్నాను. సంవత్సరం క్రితం స్నేహితుల ద్వారా హర్లీని కలుసుకున్నాను. మొదట్లో మా ప్రయాణం గొప్పగా అనిపించింది. దాన్ని ఎవరూ కాదనలేరు. కాని మా బంధం ఎక్కువ కాలం నిలవలేదు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విక్కీ కౌశల్‌, స్వాతంత్ర్య సమరయోధుడు ‘రామ్‌ మహ్మద్‌ సింగ్‌ ఆజాద్‌’ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘ఉద్ధమ్‌ సింగ్‌’ సినిమా షూటింగ్‌లో బీజీగా ఉన్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top