ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ కాదు!

Venkatesh Launch Payal Rajput RDX Love Movie First Look - Sakshi

ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ గురించి విన్నాం. మరి.. ఆర్‌డీఎక్స్‌ ప్రేమ అంటే.. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని అర్థమవుతోంది. ఈ ఘాటు ప్రేమకథలో ‘హుషారు’ ఫేమ్‌ తేజస్‌ కంచెర్ల, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. రామ్‌ మునీష్‌ సమర్పణలో సి. కల్యాణ్‌ నిర్మించారు. సి.వి రావు సహ నిర్మాత. శంకర్‌ భాను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది.

నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం ఫస్ట్‌ లుక్‌ను హీరో వెంకటేశ్‌ విడుదల చేసి, ఈ సినిమా హిట్‌ కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు కేఎస్‌ రవీంద్ర కూడా పోస్టర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో పాల్గొని, యూనిట్‌కి శుభాకాంక్షలు అందజేశారు. వీకే నరేశ్, ఆదిత్యామీనన్, నాగినీడు, తులసి, ఆమని, ముమైత్‌ఖాన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు రధన్‌ సంగీతం అందించారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చిన్నా.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top