కొత్త దర్శకుడితో మెగా ప్రిన్స్ | Varun tej next film with Debut director | Sakshi
Sakshi News home page

Dec 15 2017 1:34 PM | Updated on Dec 15 2017 1:41 PM

Varun tej next film with Debut director - Sakshi

మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్, సక్సెస్ సాధించడానికి చాలా సమయం పట్టింది. ఇటీవల ఫిదా సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ సాధించిన వరుణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తొలి ప్రేమ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్. బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.

తనకు ఫిదా లాంటి బిగ్ హిట్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో షార్ట్ ఫిలిం దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శశి అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. మరి రెండు సినిమాల్లో ముందుగా ఏ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement