బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు

Vanitha Vijay Kumar Interview on Tamil Big Boss - Sakshi

చెన్నై, పెరంబూరు: బిగ్‌బాస్‌ హౌస్‌లో తానెవరి ప్రేమలోనూ పడలేదని నటి వనితా విజయకుమార్‌ పేర్కొంది. నటుడు కమలహాసన్‌ వ్యాఖ్యాతగా బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌షో సీజన్‌–3 జరుగుతున్న విషయం తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను పొందుతోంది. ఈ 18 మంది సినీ సెలబ్రిటీలు సభ్యులుగా కలిగిన ఈ గేమ్‌ ఫోలో గత 7న నటి ఫాతిమాబాబు బయటకు వచ్చేసింది. కాగా గత ఆదివారం మరో సంచలన నటి వనితా విజయకుమార్‌ ఎలిమినేట్‌ అయ్యింది. నిజానికి ఆమె అంత త్వరగా బయటకు వచ్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. వనిత బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంటూనే ఆ కార్యక్రమానికి రేటింగ్‌ పెరుగుతోందన్న విషయం తెలిసిందే.

అయినా ఓటింగ్‌ విధానంలో వనిత ఎలిమినేట్‌ కాక తప్పలేదు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత నటి వనితావిజయకుమార్‌ ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను అంత త్వరగా ఎలిమినేట్‌ అవుతానని ఊహించలేదని అంది. అయితే తాను హౌస్‌లో ఉండాలని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తి చేయడం సంతోషం కలిగించిందని చెప్పిందిు. గత బిగ్‌బాస్‌ హౌస్‌లో పాల్గొన్న వారి మాదిరి తాను ఈ గేమ్‌ షో గురించి విమర్శించనని, నిర్వాహకులు తమని నటింపజేయలేదని తెలిపింది అదేవిధంగా హౌస్‌లో తనకెలాంటి కొరత జరగలేదని చెప్పింది..తానేమిటో అందరికీ తెలుసని, తనకు చట్టం గురించి తెలుసని అంది. బిగ్‌బాస్‌ హస్‌లో ఆడమగ ప్రేమలో పడుతుంటారని, అదే విధంగా తానూ ప్రేమలో పడతానని ప్రేక్షకులు భావించారని అంది. అయితే తానెవరినీ ప్రేమించలేదని చెప్పింది. అలాంటి తప్పు తాను చేయనని అంది. తాను ముగ్గురు పిల్లలకు తల్లిని కాబట్టి తనకు బాధ్యత ఉందని అంది. అయితే ఇతరులు ప్రేమలో పడడంలో తప్పు లేదని వనితావిజయకుమార్‌ పేర్కొంది. ఆడ మగ మాట్లాడుకోకుండా ఉండలేరని, కాబట్టి అలాంటప్పుడు ప్రేమలో పడడం అన్నది సహజం అని వనిత పేర్కొంది. మరో విషయం ఏమిటంటే రాత్రుల్లో లైట్స్‌ ఆపివేస్తున్నట్లు టీవీల్లో చూపించినా, అది కొన్ని క్షణాలేనని, ఆ తరువాత లైట్లు వెలుగుతూనే ఉంటాయని చెప్పింది. తాను త్వరలో ఒక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నటి వనితావిజయకుమార్‌ తెలిపింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top