ఉప్పొంగే ప్రేమకథ | Uppena first look poster out | Sakshi
Sakshi News home page

ఉప్పొంగే ప్రేమకథ

Feb 15 2020 1:13 AM | Updated on Mar 10 2020 4:09 PM

Uppena first look poster out - Sakshi

వైష్ణవ్‌ తేజ్‌

సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన బుచ్చిబాబు సన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. ‘ఆసి, సంగీత’ పాత్రల్లో వైష్ణవ్, కృతి కనిపించనున్నారు. సినిమాలో హీరోహీరోయిన్ల లుక్స్‌ను వేలంటైన్స్‌ డే సందర్భంగా విడుదల చేశారు. విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 2న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవి శ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: వై. అనిల్, బి.అశోక్, సీఈఓ: చెర్రీ. 

Advertisement
 
Advertisement
Advertisement