మరోసారి దేవుడి పాత్రలో..? | Trivikram to Show Pawan Kalyan As God? | Sakshi
Sakshi News home page

మరోసారి దేవుడి పాత్రలో..?

Jun 26 2016 9:00 AM | Updated on Mar 22 2019 5:33 PM

మరోసారి దేవుడి పాత్రలో..? - Sakshi

మరోసారి దేవుడి పాత్రలో..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే గోపాల గోపాల సినిమాలో మోడ్రన్ కృష్ణుడిగా ఆకట్టుకున్న పవన్. ఈ సారి త్రివిక్రమ్ సినిమాలో దేవుడి పాత్రలో...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే గోపాల గోపాల సినిమాలో మోడ్రన్ కృష్ణుడిగా ఆకట్టుకున్న పవన్. ఈ సారి త్రివిక్రమ్ సినిమాలో దేవుడి పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అ..ఆ.. సినిమాతో సూపర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్, ప్రస్తుతం పవన్తో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడు. ఈ సినిమాకు 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట.

కథా కథనాలు ఎంటో చెప్పకపోయినా టైటిల్ను బట్టి ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపిస్తాడని భావిస్తున్నారు. గతంలో ఖలేజా సినిమాలో మహేష్ బాబును దేవుడిగా చూపించిన త్రివిక్రమ్, ఈ సారి పవర్ స్టార్ను అదే తరహాలో చూపించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న పవన్ డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement