మరోసారి త్రివిక్రమ్‌తో జూనియర్‌ ఎన్టీఆర్‌ | Trivikram Next Movie With Junior NTR | Sakshi
Sakshi News home page

మరోసారి త్రివిక్రమ్‌తో జూనియర్‌ ఎన్టీఆర్‌

Jan 24 2020 4:49 PM | Updated on Jan 24 2020 5:29 PM

Trivikram Next Movie With Junior NTR - Sakshi

మాటల మాంత్రికుడు, దర్శకుడు ‘త్రివిక్రమ్‌’ శ్రీనివాస్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ మంచి హిట్‌ను సంపాదించిన విషయం తెలిసిందే. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న తారక్‌కు ఈ సినిమా మరింత ఫాలోయింగ్‌ను తీసుకు వచ్చింది.  అయితే ఈ వేసవిలో మరోసారి వీరు జతకడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన హ్యట్రిక్‌ మూవీ ‘అల వైకుంఠపురములో’ సైతం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, అలియాభట్‌, ఒలియా ముఖ్యప్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే తారక్‌ త్రివిక్రమ్‌ మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement