తారలు.. ఇంట్లో ఉన్న వేళ.. | Tollywood Celebrities Shares Home quarantine in Social Media | Sakshi
Sakshi News home page

తారలు.. ఇంట్లో ఉన్న వేళ..

Mar 31 2020 8:17 AM | Updated on Mar 31 2020 8:17 AM

Tollywood Celebrities Shares Home quarantine in Social Media - Sakshi

పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న నటి చార్మి,బర్త్‌డే సెలెబ్రేట్‌ చేసుకుంటున్న రాంచరణ్‌తేజ్‌

బంజారాహిల్స్‌: కరోనా వైరస్‌ కారణంగా సినీ తారలు స్వీయ గృహనిర్భందంలోకి వెళ్లారు. స్టే హోం.. అంటూ అందరికీ సందేశం ఇస్తూ తాము కూడా ఇంట్లోనే ఉంటున్నామంటూ సందేశాలు పెడుతున్నారు. బయటికి వెళ్లకండి ఇంట్లోనే ఉండండి అంటూ సూచిస్తూ అందర్నీ అప్రమత్తం చేస్తున్నారు. హీరో వరుణ్‌తేజ్‌ ఇంట్లోనే ఉంటూ తనకు ఇష్టమైన బాక్సింగ్‌ నేర్చుకుంటున్నాడు. తాను ఇంట్లోనే ఉంటున్నానని మీరు కూడాబయటకు వెళ్లకండి అంటూ సామాజిక మాద్యమాల్లో పిలుపునిస్తున్నాడు.

మరో నటుడు రాంచరణ్‌తేజ్‌ తాను ఇంట్లోనే ఉంటున్నానని పుట్టిన రోజును కూడా ఒక్కడినే సెలెబ్రేట్‌ చేసుకున్నానని కేక్‌ కట్‌చేసిన ఫొటోలను షేర్‌ చేశాడు. నటి కృతికర్భందా, చార్మి, సమంతా అక్కినేని తదితరులు తమ పెంపుడు కుక్కలతో సరదాగా ఆడుకుంటున్నారు. నా కుక్కతోనే మంచి టైం పాస్‌ అవుతుందని చార్మి పేర్కొన్నారు. నాగచైతన్య ప్రకృతి అందాలను తిలకించడానికి తనకు మంచి టైం దొరికిందని పేర్కొన్నారు. ఇలా తారలంతా తాము ఇంట్లో ఉంటూ ఏమేమి చేస్తున్నామో సరదాగా ట్వీట్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement