ముచ్చటగా ముగ్గురు తారల బర్త్డే | three tollywood stars celebrate birthdays on the same day | Sakshi
Sakshi News home page

ముచ్చటగా ముగ్గురు తారల బర్త్డే

Apr 8 2015 3:04 PM | Updated on Aug 28 2018 5:06 PM

ముచ్చటగా ముగ్గురు తారల బర్త్డే - Sakshi

ముచ్చటగా ముగ్గురు తారల బర్త్డే

ఏప్రిల్ 8వ తేదీ.. టాలీవుడ్ అభిమానులు డబుల్ కాదు.. త్రిబుల్ బొనాంజా చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే.. ఈరోజు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు తారల బర్త్డే ఉంది.

ఏప్రిల్ 8వ తేదీ.. టాలీవుడ్ అభిమానులు డబుల్ కాదు.. త్రిబుల్ బొనాంజా చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే.. ఈరోజు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు తారల బర్త్డే ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుట్టినరోజున విభిన్నంగా ట్విట్టర్ ఖాతా తెరిచి ప్రారంభించాడు. దాంతో బన్నీ పుట్టినరోజు విషయం అందరికీ బాగానే తెలిసిపోయింది.

ఇక ఇప్పటికే అతిథిపాత్రతో తెరంగేట్రం చేసి, హీరోగా ముందుకొస్తున్న అక్కినేని అఖిల్ బర్త్డే కూడా ఇదే రోజు. ఆ సందర్భంగా అఖిల్ తొలి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో నితిన్.. ఆ సినిమా టీజర్ను విడుదల చేశాడు. ఇక వరుసపెట్టి హిట్ సినిమాల హీరోయిన్గా పేరొందిన నిత్యామీనన్ పుట్టిన రోజు కూడా ఏప్రిల్ 8వ తేదీనే. ముగ్గురి పుట్టినరోజూ ఒకే తేదీన కావడంతో.. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కొసమెరుపు: వీళ్లు ముగ్గురే కాదండోయ్.. పవర్స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకిరా నందన్ పుట్టింది కూడా ఏప్రిల్ 8వ తేదీనే. ఈ సందర్భంగా హీరో రాంచరణ్ అకిరాకు ఫేస్బుక్లో శుభాకాంక్షలు తెలిపాడు. జూనియర్ పవర్స్టార్కు అభినందనలు.. బోలెడన్ని ప్రేమాభిమానాలు అంటూ పోస్ట్ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement