నా కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ ఇదే! | 'This one may be a game-changer' | Sakshi
Sakshi News home page

నా కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ ఇదే!

Dec 8 2015 12:14 AM | Updated on Sep 3 2017 1:38 PM

నా కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ ఇదే!

నా కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ ఇదే!

‘‘ ‘శంకరాభరణం’ చిత్రంలో ఎంటర్‌టైనింగ్ పార్ట్‌ను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.

- నిఖిల్
‘‘ ‘శంకరాభరణం’ చిత్రంలో ఎంటర్‌టైనింగ్ పార్ట్‌ను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.  దర్శకుడు ఉదయ్ పన్నెండేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది’’ అని కోన వెంకట్ అన్నారు. నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ‘శంకరాభరణం’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం ఈ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.

కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘ప్రథ మార్థంలో సప్తగిరి, సెకండాఫ్‌లో పృథ్విరాజ్‌ల కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అని అన్నారు.‘‘ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా రీచ్ అవ్వాలని ‘శంకరాభరణం’ చేశాను. అది నెరవేరింది. 600 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేస్తే అసలు చూస్తారా అని నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ షో నుంచి థియేటర్స్ హౌస్‌ఫుల్. నా కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ ఇదే’’ అని నిఖిల్  చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకులు నిలబెట్టిన సినిమా ఇది. అందుకే మేం మీ ముందు ధైర్యంగా నిలబడి ఈ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నాం’’ అన్నారు. వెంకటేశ్ అనే అంధ విద్యార్థి మాట్లాడుతూ - ‘‘నా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్లా. స్టార్టింగ్ టు ఎండింగ్ కడుపుబ్బా న వ్వుతూనే ఉన్నాం. చాలా కాలం తర్వాత బాగా నవ్వానన్న ఫీలింగ్ కలిగింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, నైజాం పంపిణీదారు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement