'సినీ రంగంలో ఎవరూ నెం 1 కాదు' | There is no top in the movie business. : Priyanka Chopra | Sakshi
Sakshi News home page

'సినీ రంగంలో ఎవరూ నెం 1 కాదు'

May 27 2015 5:38 PM | Updated on Apr 3 2019 6:23 PM

'సినీ రంగంలో ఎవరూ నెం 1 కాదు' - Sakshi

'సినీ రంగంలో ఎవరూ నెం 1 కాదు'

చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ అంటూ ఎవరూ ఉండరని బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా అన్నారు.

ముంబై: చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ అంటూ ఎవరూ ఉండరని బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా అన్నారు. నెంబర్ వన్ స్థానం ప్రతీ శుక్రవారం మారుతుంటుందని, చిత్రం వసూళ్లు వారి స్థానంపై ప్రభావం చూపుతుందని చెప్పారు. అయితే టాప్-5 కథానాయికల్లో తాను కచ్చితంగా ఉంటాని తెలిపారు.

తానెప్పుడూ స్టార్లా భావించనని ప్రియాంక చోప్రా అన్నారు. ఈ రంగంలో సాధించానన్న సంతృప్తి ఉందని చెప్పారు. తన 13 ఏళ్ల కెరీర్లో ఎత్తుపల్లాలను చవిచూశానని ప్రియాంక గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకులకు వినోదం అందించటానికి మెరుగ్గా పనిచేయాలని తాను కోరుకుంటానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement