డబుల్‌ ధమాకా | Telugu Producer Chanti Addala Birth Day | Sakshi
Sakshi News home page

డబుల్‌ ధమాకా

Jun 9 2019 1:06 AM | Updated on Jun 9 2019 1:06 AM

Telugu Producer Chanti Addala Birth Day - Sakshi

చంటి అడ్డాల

ప్రభాస్‌తో ‘అడవి రాముడు’, జూ. ఎన్టీఆర్‌తో ‘అల్లరిరాముడు’ వంటి చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల త్వరలో రెండు కొత్త సినిమాల నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కళా దర్శకుడిగా కెరీర్‌  ఆరంభించిన ఆయన నిర్మాతగా మారారు. పలువురు ప్రముఖ హీరోలతో అభిరుచి కలిగిన చిత్రాలు నిర్మించిన ఆయన పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చంటి అడ్డాల మాట్లాడుతూ– ‘‘సినీరంగంలో 38 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పటివరకు పది సినిమాలను నిర్మించాను. ప్రేక్షకుల అభిరుచి, ట్రెండ్‌కు తగ్గట్టుగా చిత్రాలను నిర్మించిన నేను అదేపంథాలో మరో రెండు సినిమాలు నిర్మిస్తున్నాను. డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ శిష్యుడు హరిహరన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ తీయబోతున్నాం. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ శిష్యుడు సుబ్బును దర్శకుడిగా పరిచయం చేస్తూ యూత్‌ఫుల్‌ కథాంశంతో మరో సినిమా నిర్మించనున్నా. పూర్తి వివరాలను త్వరలో చెబుతా’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement