తేజ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘1000 అబద్ధాలు’
వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చెయ్యాలంటారు పెద్దలు. మిగతా విషయాల్లో అబద్ధాలు ఆడడం కరెక్ట్ కాదు కానీ, పెళ్లి విషయంలో మాత్రం పెద్దలు ఓ భారీ వెసులుబాటు ఇచ్చేశారు.
వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చెయ్యాలంటారు పెద్దలు. మిగతా విషయాల్లో అబద్ధాలు ఆడడం కరెక్ట్ కాదు కానీ, పెళ్లి విషయంలో మాత్రం పెద్దలు ఓ భారీ వెసులుబాటు ఇచ్చేశారు. అందుకే ఈ అబద్ధాలను నమ్ముకుని ఓ కుర్రాడు తన ప్రేమను పెళ్లి వరకూ ఎలా తీసుకు వెళ్లాడన్నదే ‘1000 అబద్ధాలు’ సినిమా నేపథ్యం. తేజ దర్శకుడు. సాయిరామ్‌శంకర్, ఎస్తర్ హీరోహీరోయిన్లు. చిత్రం మూవీస్ సమర్పణలో శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రభాకర్ పాలడుగు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘తేజ సినిమాల్లో రొమాన్స్ ఎంత బావుంటుందో, ఎంటర్‌టైన్‌మెంట్ అంతకన్నా బావుంటుంది. ఈ సినిమాలో కూడా రొమాన్స్ ఉంటుంది కానీ, వినోదానికే పెద్ద పీట వేశారు. సినిమా ప్రారంభ సన్నివేశం మొదలుకుని శుభం కార్డు వరకూ నవ్వుతూనే ఉంటారు ప్రేక్షకులు. అంత బాగా పండింది కామెడీ. ఓ రకంగా వేయి నవ్వుల విందు ఇది.
దర్శకునిగా తేజ విశ్వరూపం కనిపిస్తుంది ఇందులో. సాయిరామ్‌శంకర్‌లోని కొత్త కోణాన్ని తేజ బాగా ఆవిష్కరించారు. రమణగోగుల స్వరపరిచిన పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. రసూల్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. కథానాయికగా పరిచయమైన ఎస్తర్‌కు ఈ చిత్రం మంచి పునాదిగా నిలుస్తుంది’’ అని తెలిపారు.