పవన్‌ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ | TFI Movie Producers Meeting With Pawan Kalyan In Vijayawada Camp Office, More Details Inside | Sakshi
Sakshi News home page

పవన్‌ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ

Jun 25 2024 4:48 AM | Updated on Jun 25 2024 12:38 PM

Movie producers meeting with Pawan Kalyan

సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించాం

పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరోసారి సమావేశం

సీఎంను అభినందించేందుకు అపాయింట్‌మెంట్‌ కోరాం: అల్లు అరవింద్‌

సాక్షి, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో తెలుగు సినిమా నిర్మాతలు సోమవారం సమావేశమ­య్యారు. విజయవాడలోని పవన్‌ కళ్యాణ్‌ క్యాంప్‌ కార్యాలయంలో నిర్వ­హిం­చిన ఈ సమావేశంలో సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పర్యాటక, సినిమాటో­గ్రఫీ శాఖ మంత్రి దుర్గేశ్, నిర్మాతలు సి.అశ్వనీదత్, అల్లు అర­వింద్, ఏఎం రత్నం, ఎస్‌.రాధాకృష్ణ, దిల్‌ రాజు, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, సుప్రియ, ఎన్వీ ప్రసాద్, బన్ని వాసు, నవీన్‌ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వ ప్రసాద్, వంశీకృష్ణ తదితరులు సమా­వేశంలో పాల్గొన్నారు. 

అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లా­డుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమ­స్యలను పవన్‌ కళ్యాణ్‌కు వివరించామని చెప్పారు.  తెలుగు సినీ పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని అభినందించడానికి అపాయింట్‌మెంట్‌ కోరామన్నారు. సినీ రంగ సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరోసారి సమావేశమవుతామని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement