మరో కాంతార లాంటి సినిమా.. తెలుగు టీజర్‌ వచ్చేసింది! | Music Director Ravi Basrur Movie Veera Chandrahasa Teaser out Now | Sakshi
Sakshi News home page

Veera Chandrahasa Teaser: డైరెక్టర్‌గా సలార్‌ సంగీత దర్శకుడు.. తెలుగు టీజర్‌ చూశారా!

May 4 2025 7:37 PM | Updated on May 4 2025 7:37 PM

Music Director Ravi Basrur Movie Veera Chandrahasa Teaser out Now

కేజీఎఫ్, సలార్ వంటి యాక్షన్ చిత్రాలతో సంగీత దర్శకుడిగా సంచలనం సృష్టించిన రవి బస్రూర్. ఆ తర్వాత వీర చంద్రహాస చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్, ఉదయ్ కడబాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై ఎన్‌ఎస్ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం, ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది.

ఈ నేపథ్యంలోనే వీర చంద్రహాస మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యక్షగానం ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. కన్నడలో సూపర్ హిట్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ రాధాకృష్ణ విడుదల చేయనున్నారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన రాక్షస చిత్రాలను తెలుగులో విజయవంతంగా రిలీజ్ చేశారు. తాజాగా వీర చంద్రహాస మూవీ రైట్స్‌ను ఆయనే సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. కన్నడలో సూపర్ హిట్‌ అయినా ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement