breaking news
Veera Chandrahasa Movie
-
వీర చంద్రహాస రెడీ
‘‘వీర చంద్రహాస’ టైటిల్‌తోపాటు ట్రైలర్ కూడా ఆసక్తిగా ఉంది. రవి బస్రూర్ ఇప్పటివరకు తనదైన సంగీతంతో అలరించగా, ఈ సినిమాతో డైరెక్టర్‌గానూ నిరూపించుకున్నారు. ఎమ్వీ రాధాకృష్ణగారు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అని హీరో విశ్వక్ సేన్ చెప్పారు. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వీర చంద్రహాస’. శివ రాజ్‌కుమార్ కీలకపాత్రపోషించగా, శిథిల్ శెట్టి, నాగశ్రీ జీఎస్ ప్రధానపాత్రలుపోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై, హిట్‌గా నిలిచింది.ఈ సినిమాని కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్‌పై ఎమ్వీ రాధాకృష్ణ త్వరలో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఎమ్వీ రాధాకృష్ణ మాట్లాడుతూ– ‘‘వీర చంద్రహాస’ చిత్రం కన్నడలో హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని రవి బస్రూర్ తెలిపారు. -
'సలార్' సంగీత దర్శకుడి పీరియాడిక్ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
కేజీఎఫ్, సలార్ సినిమాలకు సంగీతమందించి గుర్తింపు తెచ్చుకున్న రవి బస్రూర్.. ఇప్పుడు ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. వీరచంద్రహాస పేరుతో కన్నడలో తెరకెక్కించాడు. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన యక్షగానం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించాడు.అంతరించిపోతున్న యక్షగానం కథతో తీసిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. పీరియాడికల్ సెటప్ అయితే ఉంది గానీ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారా లేదా అనేది చూడాలి. ట్రైలర్ చూస్తే సమ్ థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటిస్తారు.వీరచంద్రహాస, తెలుగు ట్రైలర్, రవి బస్రూర్, మూవీ న్యూస్ -
మరో కాంతార లాంటి సినిమా.. తెలుగు టీజర్ వచ్చేసింది!
కేజీఎఫ్, సలార్ వంటి యాక్షన్ చిత్రాలతో సంగీత దర్శకుడిగా సంచలనం సృష్టించిన రవి బస్రూర్. ఆ తర్వాత వీర చంద్రహాస చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్, ఉదయ్ కడబాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ఎస్ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం, ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ నేపథ్యంలోనే వీర చంద్రహాస మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యక్షగానం ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. కన్నడలో సూపర్ హిట్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎమ్వీ రాధాకృష్ణ విడుదల చేయనున్నారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన రాక్షస చిత్రాలను తెలుగులో విజయవంతంగా రిలీజ్ చేశారు. తాజాగా వీర చంద్రహాస మూవీ రైట్స్‌ను ఆయనే సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయినా ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాల్సిందే. -
తెలుగులో కన్నడ బ్లాక్ బస్టర్ ‘వీర చంద్రహాస’
‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి యాక్షన్ చిత్రాలతో సంగీత దర్శకుడిగా సంచలనం సృష్టించిన రవి బస్రూర్, ఇప్పుడు ‘వీర చంద్రహాస’ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్, ఉదయ్ కడబాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ఎస్ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం, ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై ఘన విజయం సాధించింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎమ్వీ రాధాకృష్ణ విడుదల చేయనున్నారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ‘రాక్షస’ చిత్రాలను తెలుగులో విజయవంతంగా రిలీజ్ చేసిన రాధాకృష్ణ, ఇప్పుడు ‘వీర చంద్రహాస’ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, “‘వీర చంద్రహాస’ కన్నడలో హిట్ టాక్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం తెలుగు రైట్స్ దక్కించుకోవడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా తెలుగులోనూ విజయం సాధిస్తుందని గట్టి నమ్మకం ఉంది. రవి బస్రూర్ సంగీతంతో అలరించడమే కాక, దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించడం సంతోషకరం” అని తెలిపారు.‘వీర చంద్రహాస’ మహాభారతంలోని అశ్వమేధిక పర్వం ఆధారంగా రూపొందిన కథ. ఒక అనాథ బాలుడు పరాక్రమవంతుడై, సద్గుణవంతుడై వీర చంద్రహాసుడిగా ఎదిగే గాథను చిత్రిస్తుంది. సినిమా చరిత్రలో తొలిసారిగా యక్షగానం వెండితెరపై వైభవంగా ఆవిష్కృతమై, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించనుంది.