
ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వీర చంద్రహాస’. ‘కేజీఎఫ్, సలార్’ వంటి చిత్రాల సంగీతదర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శిథిల్ శెట్టి ఓ లీడ్ రోల్‌లో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఎన్‌ఎస్ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై, హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాని ఈ నెల 19న తెలుగులో విడుదల చేస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ మాట్లాడుతూ– ‘‘హోంబలే ఫిల్మ్స్‌పై ఇటీవల విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం తరహాలోనే ‘వీర చంద్రహాస’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం’’ అని తెలిపారు. రవి బస్రూర్ మాట్లాడుతూ– ‘‘వీర చంద్రహాస’ అనేది మహాభారతంలోని అశ్వమేధిక పర్వంలోని కథ. ఇది ఒక అనాథ కుర్రాడి గొప్ప కథను చెబుతుంది’’ అన్నారు.